శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 మే 2017 (17:39 IST)

ములాయం "బాహుబలి 2" చిత్రం చూస్తుంటే.. నిలువుకాళ్లపై నిలబడిన కమాండో... నెటిజన్ల ఫైర్

ఎస్పీ అధినేత ములాయం సింగ్ చిత్రం చూస్తుంటే.. ఓ సెక్యూరిటీ మాత్రం శిక్ష అనుభవించాడు. అదీ 3 గంటల పాటు ఏకబిగువున నిలువుకాళ్ళపై నిలుచున్నారు. ఈ విషయాన్ని ఓ మీడియా జర్నలిస్టు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట

ఎస్పీ అధినేత ములాయం సింగ్ చిత్రం చూస్తుంటే.. ఓ సెక్యూరిటీ మాత్రం శిక్ష అనుభవించాడు. అదీ 3 గంటల పాటు ఏకబిగువున నిలువుకాళ్ళపై నిలుచున్నారు. ఈ విషయాన్ని ఓ మీడియా జర్నలిస్టు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ములాయం సింగ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
గత నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి 2 చిత్రం దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తిలకిస్తున్నారు. ఇందులోభాగంగా, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్... లక్నోలోని గోమ్తినగర్‌లో తన సోదరుడు శివపాల్‌ యాదవ్‌, ఇతర అనుచరులతో కలిసి ‘బాహుబలి-2’ సినిమా చూశారు.
 
అయితే, ఈ సంద‌ర్భంగా తీసిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ములాయం సింగ్ మూడు గంటల పాటు కూర్చుని సినిమా చూస్తుంటే ఆయన వెనకే ఓ కమాండో నిలబడి ఉన్నాడు. ములాయం సింగ్ వెనుక మొత్తం ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది నిలబడే ఉండ‌గా వారిలో ఒకరు ఎన్‌ఎస్‌జీకి చెందిన బ్లాక్‌క్యాట్‌ కమాండో ఉన్నారు.
 
ఎన్‌ఎస్‌జీ కమాండోలు భారత్‌కి చెందిన 16 మంది వీవీఐపీలకు భద్రత కల్పిస్తున్నారు. అందులో ములాయంసింగ్ ఒకరుగా ఉన్నారు. క‌మాండోను 3 గంట‌ల‌పాటు నిల‌బెట్టిన ఆ నేత‌ల‌పై ప‌లువురు ప‌లు ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. సీనియర్‌ పాత్రికేయుడు శ్రీనివాసన్‌ జైన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేశారు. స‌ద‌రు కమాండో మూడు గంటల పాటు అలాగే నిల‌బడాల్సి వచ్చిందని ఆయ‌న అన్నారు. సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో అంత సేపు నిలబడటం సాధ్యం కాదని ఆయ‌న ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.