పెళ్లయినా నీ ఇష్టం అన్నాడట, అందుకే కాజల్ దున్నేస్తోంది...
పెళ్లయితే ఇక సినిమాల్లో నటించడం మానేయ్ అని నటీమణులను భర్తలు అంటుంటారని వింటుంటాం. కానీ పెళ్లయ్యాక కూడా నీ వృత్తిని నువ్వు ఎందుకు మానుకోవాలి, కొనసాగించు అని ప్రోత్సహించే భర్తలు చాలా అరుదు. అలాంటి వారు భర్తగా లభిస్తే ఇక అంతకన్నా అదృష్టం ఏముంటుందీ?
కాజల్ అగర్వాల్ కు అలాంటి లక్కీ హస్బెండ్ దొరికారు. పెళ్లి చేసుకున్నప్పటికీ నటనకు స్వస్తి చెప్పవద్దనీ, నీ వృత్తి కొనసాగించని ప్రోత్సహిస్తున్నారట. భర్త ప్రోత్సాహంతో కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేయడానికి అంగీకరిస్తోంది.
ప్రస్తుతం ఆమె నటించిన మోసగాళ్లు చిత్రం ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా వుంది. ఆచార్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోంది. తాజాగా కింగ్ నాగార్జున సరసన నటించేందుకు అంగీకరించినట్లు టాలీవుడ్ న్యూస్.