సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (13:37 IST)

ఏం చేసేదీ నా తల్లిదండ్రుల మాట కాదనలేకపోయా, ఐతే చచ్చిపోదాం రమ్మంటూ...

నిజామాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు.
 
వివరాల్లోకి వెళితే... సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన వందన అనే యువతి చింతల్ తండాకు చెందిన సుభాష్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఐతే సుభాష్ తల్లిదండ్రులు వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. పెద్దల మాట కాదనలేక ఆమెను పెళ్లాడాడు. పెళ్లయి 2 నెలలయింది. ప్రేమికురాలు బుధవారం ఉదయం సుభాష్ కి ఫోన్ చేసి పిలిచింది.
 
ఇద్దరూ శివారులో వున్న పొలంలోకి వెళ్లారు. అక్కడికెళ్లాక... తనను కాదని వేరే యువతిని ఎలా పెళ్లాడావంటూ ఆమె నిలదీసింది. ఈక్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుని చనిపోదామని నిర్ణయించుకుని పురుగులు మందు తాగారు. పొలంలో నురగలు కక్కుతు వున్న జంటను చూసి స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వందన చనిపోయింది. సుభాష్ కూడా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.