సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (15:00 IST)

బన్నీ ఫ్లాప్ సినిమా... అక్కడ హిట్ అయింది...

బన్నీ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమా వల్ల నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే ఇక్కడ డిజాస్టర్ అయిన ఈ సినిమా మరోచోట సూపర్‌హిట్ అయింది.
 
గత ఏడాది మే నెలలో విడుదలైన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో యూట్యూబ్‌లో విడుదలైంది. విడుదలైన రెండు రోజులకే ఈ సినిమాను కోటి మందికి పైగా వీక్షించారు. దీనికి వచ్చే లైక్‌లు కూడా లక్షల్లో ఉండటం విశేషం.
 
ఇంతకుముందు కూడా బన్నీ సినిమాలు డబ్ చేయబడి యూ ట్యూబ్‌లో విడుదలైనప్పుడు వాటికి కూడా అత్యధిక వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సినిమాకు ఊహించనంత రెస్పాన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ పేర్కొన్నది. సినిమా ఇక్కడ ఫ్లాప్ అయినా అక్కడ హిట్ అయినందుకు బన్నీ అభిమానులు సంతోషపడుతున్నారట.