గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (09:28 IST)

కింగ్ నాగార్జున బర్త్ డే.. లవ్‌స్టోరీ నుంచి కొత్త పోస్టర్

Love story
అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం లవ్‌స్టోరీ. ఈ సినిమా నుంచి ప్రస్తుతం పోస్టర్ రిలీజైంది. కింగ్ నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని తాజా పోస్టర్ విడుదలైంది.
 
కరోనావైరస్ లేకుంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ఉండేది. ఈ లవ్ స్టోరీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతలు వచ్చేనెల నుండి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నారు. 
 
సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని, ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేక సెట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. 
 
ప్రస్తుతం, కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న సమయంలో షూటింగ్ తిరిగి ప్రారంభించాలంటే సినిమా వాళ్లు వెనకడుగేస్తున్నారు. కానీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ఈ లవ్ స్టోరీ యూనిట్ మాత్రం అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌కి ఆటంకం కలగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.