శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 31 జనవరి 2017 (20:52 IST)

చైతు-సమంతలు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి... నాగార్జున, సమంతకు కేటీఆర్ చీర

నాగార్జున త్వరలో తన ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లి చేయబోతున్నారు. మొన్ననే నాగచైతన్య- సమంతల నిశ్చితార్థం జరిగింది. ఈ నేపధ్యంలో అందరూ వారి పెళ్లెప్పుడు చేస్తారూ అని అడుగుతున్నారు. దీనికి నాగార్జున ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైతు జనవరిలో ఎంగే

నాగార్జున త్వరలో తన ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లి చేయబోతున్నారు. మొన్ననే నాగచైతన్య- సమంతల నిశ్చితార్థం జరిగింది. ఈ నేపధ్యంలో అందరూ వారి పెళ్లెప్పుడు చేస్తారూ అని అడుగుతున్నారు. దీనికి నాగార్జున ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైతు జనవరిలో ఎంగేజ్మెంట్ అన్నాడు... అలాగే చేసేశాను. ఇక పెళ్లి విషయం కూడా అంతే. ఎక్కడ, ఎప్పుడు వివాహం చేసుకుంటామని అడిగితే అలా చేసేందుకు తను సిద్ధంగా వున్నానని వెల్లడించారు. తను నటిస్తున్న ఓ నమో వేంకటేశాయ చిత్రం విశేషాలను కూడా చెప్పారు. ఈ చిత్రంలో భక్తుడు- వేంకటేశ్వర స్వామి సంవాదం ఆసక్తికరంగా ఉంటుందన్నారు.
 
ఇకపోతే సమంత మంగళవారం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వుండేందుకు ఆమె అంగీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆమెకు చేనేత చీరను బహూకరించారు. నాగచైతన్యతతో నిశ్చితార్థం జరిగిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.