సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 6 మే 2020 (21:13 IST)

చిరంజీవి గారు.. యాక్షన్ ప్లాన్ కావాలంటున్న నాగార్జున

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఓ వెబ్‌సైట్ నెగటీవ్‌గా వార్తలు రాయడం.. ఆ వార్తలను విజయ్ ఖండించడం తెలిసిందే. అంతేకాకుండా.. ఇలాంటి వెబ్ సైట్లను ఫేక్ న్యూస్‌లను ఖండించాలి అంటూ పిలుపు ఇచ్చాడు. ఈ పిలుపుకు ఇండస్ట్రీ నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న నటులు వరకు మద్దతు లభించింది. కొరటాల శివ, పూరి జగన్నాథ్, సుకుమార్, వంశీ పైడిపల్లి.. ఇలా కొంతమంది దర్శకులు ట్విట్టర్లో స్పందించి విజయ్‌కు సపోర్ట్‌ని అందించారు. ఇదిలా ఉంటే... టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా స్పందించారు.
 
చిరంజీవి గారు... సహచరుడికి అండగా నిలబడటం అభినందనీయం. మహేష్‌ బాబు, రవితేజ, రానా, కొరటాల శివ, వంశీ పైడిపల్లి.. అందరూ నీకు అండగా ఉన్నామని విజయ్‌కు భరోసా కల్పించారు. అయితే.. కేవలం అండగా ఉంటే సరిపోదు. దీనిని ఎదుర్కొనేందుకు మనకు ఒక యాక్షన్ ప్లాన్ కావాలి అంటూ ట్వీట్ చేసారు నాగార్జున. 
 
ఇలా.. నాగార్జున ట్వీట్ చేయడంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. నాగ్ సార్.. యాక్షన్ ప్లాన్ కావాలి అనడం.. వింటుంటే సౌండ్ బాగుంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఇదంతా చూస్తుంటే... ఈ సంఘటనపై సినీ ఇండస్ట్రీ కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. మరి భవిష్యత్‌లో ఇది ఇంకెంత దూరం వెళుతుందో..? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో..? చూడాలి.