శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (13:03 IST)

కారంచేడులో బాలయ్య: గుర్రపు స్వారీ చేసిన అఖండ!

నందమూరి హీరో బాలకృష్ణ తన భార్యతో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. అక్కడ సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన బంధువులు గురువారం కారంచేడుకు చేరుకున్నారు. 
 
బాలకృష్ణను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు.
 
కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య గుర్రం స్వారి చేశారు. 
 
ఇకపోతే కరోనా కారణంగా ఎవరినీ లోపలికి అనుమతించట్లేదని సమాచారం. చివరిసారిగా, 2019లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం కుప్పంలో నారా, నందమూరి కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.
 
సినిమాల విషయానికి వస్తే.. అటు 'అఖండ' బ్లాక్ బస్టర్ హిట్, ఇటు ఆహా 'అన్‌స్టాపబుల్' షో సూపర్ హిట్ అవడంతో బాలకృష్ణ  మంచి జోరు మీద ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన 'అఖండ' సినిమాకు ఇప్పటికీ వసూళ్ల వర్షం కురుస్తోంది.