గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (18:22 IST)

ఎఫ్ 3 టీంని అభినందించిన నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna,  Anil Ravipudi, sirish
Nandamuri Balakrishna, Anil Ravipudi, sirish
ఎఫ్ 3 చిత్రం అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా వుంది. సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. ఇంతమంచి ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకులకు అందించిన ఎఫ్ 3చిత్ర యూనిట్ కి అభినందనలు'' తెలిపారు నటసింహ నందమూరి బాలకృష్ణ.  
 
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'.  డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎఫ్3 మే 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఎఫ్ 3 ప్రత్యేక ప్రిమియర్ షోని ప్రసాద్ ల్యాబ్స్ లో  వీక్షించారు బాలకృష్ణ.
 
అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎఫ్ 3 చిత్రం పూర్తి వినోదాత్మకంగా వుంది. సినిమా అంతా చాలా ఎంజాయ్ చేశాను. వెంకటేష్, వరుణ్ తేజ్ మిగతా నటీనటులంతా అద్భుతంగా చేశారు. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాలని ఆకట్టుకునేలా  ఈ చిత్రాన్ని తీర్చిద్దిన ఎఫ్ 3 యూనిట్ మొత్తానికి అభినందనలు'' అన్నారు బాలకృష్ణ.