ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (10:21 IST)

తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటాడు .. మోక్షజ్ఞపై బాలయ్య కామెంట్స్

తన కుమారుడు వెండితెరపై తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటాడని తన ఏకైక కుమారుడు మోక్షజ్ఞపై సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పైగా, నందమూరి వంశం నుంచి మూడోతరానికి వెండితెర హీరోగా మోక్షజ్ఞ తారకరామతేజ సినీర

తన కుమారుడు వెండితెరపై తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటాడని తన ఏకైక కుమారుడు మోక్షజ్ఞపై సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పైగా, నందమూరి వంశం నుంచి మూడోతరానికి వెండితెర హీరోగా మోక్షజ్ఞ తారకరామతేజ సినీరంగ ప్రవేశం చేసే ముహుర్తాన్ని కూడా ఖరారు చేశారు. 
 
మోక్షజ్ఞ పుట్టినరోజును బుధవారం జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని అభిమానులు నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞ తారకరామతేజ 23వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరి సమక్షంలో కేక్ కట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. 
 
నా వారసుడిగా, తాతకు తగ్గ మనవడిగా మోక్షజ్ఞ ఎదుగుతాడనే నమ్మకముందన్నారు. వచ్చే ఏడాది జూన్ తర్వాత మోక్షజ్ఞను కథానాయకుడిగా పరిచయం చేయబోతున్నాం. నన్ను ఆదరించినట్లుగానే నా వారసుడిని ఆదరిస్తారని భావిస్తున్నాను అని తెలిపారు.