గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (15:48 IST)

పిల్లవాడికి 20 ఏళ్లు-నాకు 80 ఏళ్లు అవసరమా?: నరేష్

naresh-pavitra
తాము భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నామని నటీనటులు నరేష్, పవిత్ర లోకేష్ అన్నారు. వారి కొత్త చిత్రం "మళ్లీ పెళ్లి"తో వారి సంబంధం ఎలా ఏర్పడిందనే విషయాన్ని తెలిపారు. ఇకపోతే.. నరేష్ ఇటీవల 60 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
 
అయినప్పటికీ అతను సీనియర్ వ్యక్తిగా తనను గుర్తించడాన్ని నిరాకరించారు. ఈ వయస్సులోనూ పవిత్రతో కలిసి పిల్లలు కలిగి వుండటం తప్పు లేదని చెప్పారు. 
 
కానీ "నేను ఇంకా పిల్లలను కలిగి ఉండగలను, కానీ అది అర్ధవంతం కాదు. పిల్లవాడికి 20 ఏళ్లు వచ్చేసరికి నాకు 80 ఏళ్లు నిండుతాయి. కాబట్టి, ఉండకపోవడమే మంచిది" అని స్పష్టం చేశారు.