సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 మే 2023 (07:01 IST)

దుష్టశక్తులనుంచి నరేష్‌గారు నన్ను కాపాడారు : పవిత్ర లోకేష్‌

Pavitra Lokesh
Pavitra Lokesh
మళ్లీ పెళ్లి ప్రీ రిలీజ్‌వేడుకలో నరేష్, పవిత్ర లోకేష్‌ సినిమాలోని పాటలకు డాన్స్ వేశారు. స్టేజీపై నుంచి మీఆందరి ఆశీస్సులు కావాలి అని ఇద్దరూ దండలు మార్చుకున్నారు. 
 
పవిత్ర లోకేష్‌ మాట్లాడుతూ, నాది ఇప్పటినుంచి కొత్త లైఫ్‌. ప్రతివారికి చిన్నప్పటినుంచి ఓ డ్రీమ్‌ వుంటుంది. అలా నాకూ ఓ డ్రీమ్‌ వుంది. అందుకే సినిమారంగానికి వచ్చాను. చిన్నతనంలో పేరెంట్స్‌ను కోల్పోయా. నటిగా కష్టపడుతూ సౌకర్యాలను సమకూర్చుకున్నా. ఆ క్రమంలో కొన్ని దుష్టశక్తులు నన్ను పడగొట్టేందుకు ప్రయత్నించాయి. అప్పడు నాకు ఒక శక్తిగా నరేష్‌గారు నిలబడ్డారు. ఇప్పుడు పాతది బ్రేక్‌ అయింది. దేవుడు అంతా సవ్యంగా వుండేలా చేశాడు. మహాతల్లి విజయనిర్మల సంస్కారాన్ని నేర్పింది. ఆమె దీవెనలు వున్నాయి. విజయకృష్ణ మూవీస్‌లో పలు సినిమాలు తీయాలని మొదలు పెట్టాం.

ఇదంతా పెద్దల ఆశీర్వాదంతో జరిగింది. కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్‌కూడా నన్ను అంగీకరించారు. అందుకే అన్నిమంచిగా జరుగుతున్నాయి.
 
ఇక మళ్లీ పెళ్లి గురించి చెప్పాలంటే, రాజుగారు, నరేష్‌గారు సినిమా తీయాలని డిసైడ్‌ చేసుకున్నారు. నేను అందులో ఓ భాగం మాత్రమే. ప్రతి విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని నాకు వివరించారు ఎం.ఎస్‌.రాజుగారు. వనితా మంచి పెర్‌ఫార్మర్‌. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్‌ చెబుతున్నాని అన్నారు.