శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (17:36 IST)

ఉత్తమ జాతీయ చిత్రం 'మహానటి'... ఉత్తమ నటి కీర్తి సురేష్

‘జాతీయ చలన చిత్ర అవార్డుల’ను ఆగస్ట్ 9న ప్రకటించారు. మహానటి ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు దక్కించుకోవడమే కాకుండా ఆ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేష్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు రాహుల్ రవైల్ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు.
 
అవార్డులు...
 
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం 'మహానటి' 
 
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ 'మహానటి' 
 
ఉత్తమ ఆడియోగ్రఫీ - రాజాకృష్ణన్ (రంగస్థలం)
 
బెస్ట్ యాక్షన్ చిత్రం 'కేజీఎఫ్' 
 
బెస్ట్ డైరెక్టర్ - ఆదిత్య దార్ (ఉరి)
 
బెస్ట్ యాక్టర్ - ఆయుష్మాన్ ఖురానా (అంధాదూన్)
 
ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)
 
జాతీయ ఉత్తమ చిత్రం 'అంధాదూన్'
 
జాతీయ ఉత్తమ మరాఠీ చిత్రం 'భోంగా' 
 
జాతీయ ఉత్తమ తమిళ చిత్రం 'బారమ్'
 
ఉత్తమ ఉర్దూ చిత్రం 'హమీద్' 
 
ఉత్తమ సంగీత దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
 
ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం - పద్మావత్ 
 
ఉత్తమ రాజస్థానీ చిత్రం - టర్టుల్ 
 
ఉత్తమ పంజాబీ చిత్రం - అర్జేదా 
 
ఉత్తమ అస్సామీ చిత్రం - బుల్ బుల్ కెన్ సింగ్   
 
ఉత్తమ సహాయ నటుడు - ఆనంద్ కిర్కిరే (చుంభక్)
 
ఉత్తమ సహాయనటి - సురేఖ సిక్రీ (బాదాయి హో)
 
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ - అ! (తెలుగు)
 
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ - కమ్మర సంభవం (మలయాళం)
 
బెస్ట్ సౌండ్ డిజైనర్ - ఉరి (హిందీ)
 
బెస్ట్ ఎడిటింగ్ - నాతిచరామి (కన్నడ)
 
బెస్ట్ డైలాగ్ - తారిఖ్ (బెంగాలీ)
 
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ - బిందుమాలిని (నాతిచరామి.. మాయావి మానవే సాంగ్)
 
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - అర్జిత్ సింగ్ (పద్మావత్.. బింతే దిల్ సాంగ్)
 
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - పీవీ రోహిత్, సాహిబ్ సింగ్, తల్హ అర్షద్ రేషి, శ్రీనివాస్ పోకలే 
 
బెస్ట్ కోరియోగ్రఫీ - పద్మావత్ (గూమర్ సాంగ్)
 
బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్ - నాన్ 
 
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్) - ఉరి 
 
బెస్ట్ స్క్రీన్ ప్లే - చిలసౌ 
 
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు)కేజీఎఫ్‌(కన్నడ)
 
ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
 
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌