గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (15:53 IST)

గాయం నుంచి కోలుకున్న నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్

Naveen polisetyy in aha programe
Naveen polisetyy in aha programe
ది కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ హీరో నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్. గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ పోలిశెట్టి ఆహాలో అలరించారు. ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3,  21, 22వ ఎపిసోడ్‌లలో మరోసారి తన ఎనర్జీటిక్ ప్రజెన్స్ అదరగొట్టారు. షో లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ని క్రియేట్ చేశారు. 
 
ట్యాలెంట్ పవర్ హౌస్ అయిన నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ ఈ వారం రాబోతోంది. తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారు. నవీన్ పడిన రెండు పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
 
ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ వున్నాయి. నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కష్టమైన క్షణాలని కూడా చాలా హ్యూమర్స్ గా చెప్పడం అలరించింది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు గిలిగింతలు పెడుతూనే హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది.
 
ఈ ఇక ఎపిసోడ్ లో నవీన్ పేల్చిన కామెడీ పంచులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ గ్రౌండ్ బ్రేకింగ్ ఎంటర్ టైన్మెంట్ ఎపిసోడ్ కోసం ఆహా లో శుక్రవారం,శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3ని మిస్ అవ్వకండి.