ద్విపాత్రాభినయంతో నయనతార హారర్ థ్రిల్లర్...
చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పంథాని కొనసాగిస్తూ... కథానాయికగా తిరుగులేని కెరియర్‌ను కొనసాగిస్తున్న నయనతార విభిన్నమైన కథలు.. విలక్షణమైన పాత్రలతో... నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే పెద్దపీట వేస్తూండడంతో వెనుతిరిగి చూసుకోవలసి అవసరం లేకుండా దూసుకుపోతోంది. తాజాగా సర్జున్ కె.ఎమ్ దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం 'ఐరా' పూర్తయింది. ఈ హారర్ థ్రిల్లర్‌లో, నయనతార ద్విపాత్రాభినయం చేస్తూండడం మరో విశేషం.
హారర్ సినిమాల్లో చేయడం నయనతారకి కొత్తేమీ కాకపోయినా... ద్విపాత్రాభినయం చేయడం మాత్రం ఆమెకి ఇదే మొదటిసారి. ఈ అంశమే ఈ సినిమాకి ఆసక్తికరమైనదిగా మారింది. కోటపాడి రాజేశ్ .. మహేశ్వరన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, తమిళంలోనూ మరియు తెలుగులోనూ ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. నయనతార ఈ రెండు భాషల్లోనూ ఒకేసారి విజయాన్ని అందుకోనుందా అంటే... మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే మరి.