శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2020 (12:39 IST)

యువతి ఎంతమందితో డేటింగ్ చేయొచ్చు? నేహా ధూపియా ఆన్సరేంటి?

బాలీవుడ్ నటి నేహా ధూపియా డేటింగ్‌పై స్పందించారు. ఒక యువతి ఎంతమందితోనైనా డేటింగ్ చేయొచ్చంటూ సెలవిచ్చారు. పైగా, ఇలాంటి యువతుల స్వేచ్ఛను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు. దీంతో నెహాపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ, తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
వెండితెరపై అవకాశాలు తగ్గిన తర్వాత నెహా ధూపియా బుల్లితెరపై సత్తా చాటుతోంది. తాజాగా 'నో ఫిల్టర్ విత్ నేహా' అనే కార్యక్రమంలో మంచి పాపులర్ అయింది. ఈ పరిస్థితుల్లో 'రోడీస్ రెవల్యూషన్' అనే ప్రోగ్రామ్‌లో నేహ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ తన ప్రియురాలు తనను మోసం చేసిందని ఆరోపించాడు. పైగా, గర్లఫ్రెండ్‌ తనతో పాటు మరో ఐదుగురు వ్యక్తుల‌తో ఒకేసారి డేటింగ్ చేసిందన్నాడు. ఈ విషయం తెలిసి ఆమెను కొట్టానని చెప్పాడు. 
 
ఈ మాట చెప్పడంతో ఆ కంటెస్టెంట్‌పై నేహా ఒంటికాలితో లేచింది. "ఆమె ఎంత మందితో తిరిగితే నీకేంటి? ఎంత మందితో డేటింగ్ చేస్తే నీకేంటి? అది ఆమెకున్న స్వేచ్ఛ. ఆమె స్వేచ్ఛను  ప్రశ్నించడానికి నీవెవరు" అంటూ కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలే ఇపుడు వైరల్ అయ్యాయి. ఆమెను టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.