ప్రియుడిని గుడ్డిగా నమ్మి సర్వస్వం సమర్పించి మోసపోయా... బాలీవుడ్ నటి

sana khan
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (09:34 IST)
తన ప్రియుడు చేతిలో మరో బాలీవుడ్ నటి మోసపోయినట్టు చెప్పుకొచ్చింది. తన ప్రియుడుని గుడ్డిగా నమ్మి సర్వస్వం కోల్పోయినట్టు పేర్కొంది. ఆ నటి పేరు సనాఖాన్. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్. బాలీవుడ్ కొరియోగ్రాఫరి మెల్విన్ లూయిస్‌కు మధ్య ప్రేమాయణం సాగింది. ఆ తర్వాత వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. కానీ, ఇటీవల వీరిద్దరూ విడిపోయారు.

ఈ క్రమంలో తన ప్రియుడు చేతులో మోసపోయినట్టు సనాఖాన్ తాజాగా ప్రకటించింది. తన బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌కు గుడ్ బై చెప్పిన సనాఖాన్ మొదటిసారి తన ప్రియుడి బాగోతాల గురించి బయటపెట్టారు. మెల్విన్ లూయిస్ చాలామంది మహిళలను మోసగించాడని, అతను మోసగాడు అని సనాఖాన్ ఆరోపించారు.

వాస్తవం చెప్పడానికి ధైర్యం కావాలని, మెల్విన్‌ను తాను గుడ్డిగా నమ్మానని, కాని అతను పెద్ద మోసగాడని తెలుసుకున్నానని సనా వ్యాఖ్యానించారు. మెల్విన్ నన్ను వివాహం చేసుకొని పిల్లలు కనాలని కోరుకున్నాడు, కానీ అమ్మాయిలను మోసం చేసే మెల్విన్‌కు కుమారుడు, కుమార్తెలు పుడితే వారికి ఏం నేర్పుతాడు అని సనా ప్రశ్నించారు.దీనిపై మరింత చదవండి :