శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 నవంబరు 2019 (21:17 IST)

ప్రియురాలికి ప్రియుడు ముద్దు పెడితే... ఏం జరుగుతుంది?

ఉదయాన్నే లేవగానే పళ్లు తోముకుంటాం. ఐతే కొంతమంది రాత్రిపూట అన్నం తిన్న తర్వాత అలాగే పడుకుంటారు. కానీ రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కూడా బ్రష్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నోరు శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా శుభ్రంగా వుంచుకుంటారు. నోటిలో వేలకొద్దీ బ్యాక్టీరియా, ఫంగస్‌లు తిష్టవేసుకుని ఉంటాయి. నోటిని శుభ్రం చేసుకోకపోతే అవి మనకు కలిగించే అనారోగ్య సమస్యలు చెప్పలేనివే. అసలు నోటి సంగతి ఏంటో ఒక్కసారి చూద్దాం.
 
నోట్లో 500 నుంచి 1000 రకాలయిన బ్యాక్టీరియా, 80 రకాల ఫంగిసైట్స్, వైరస్, పేరసైట్లు ఉంటాయి. నోటిలో ఒక్క పన్ను కనుక పుచ్చిపోతే అందులో తిష్టవేస్తుంది బ్యాక్టీరియా. ఇక అక్కడ్నుంచి మెల్లమెల్లగా ఇతర పళ్లకు వ్యాపించి మొత్తం పళ్లకు వ్యాపించి అన్నిటినీ నాశనం చేసే పనికి పూనుకుంటుంది. 
 
ఐతే నోట్లో ఉన్న అన్ని బ్యాక్టీరియాలు హానికరమైనవి కావు. కొన్ని ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఐతే నోటిని ఉదయం పూట మాత్రమే కాకుండా రాత్రి భోజనం ముగించిన తర్వాత కూడా శుభ్రం చేసుకోవాలి. పళ్లు తోముకోవాలి. నోటిని శుభ్రం చేసుకోకుండా ఓ నాలుగైదు గంటలు టైమిస్తే చాలు నోట్లో ఉన్న బ్యాక్టీరియా రెట్టింపవుతుంది. కనుక రాత్రిపూట భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయకుండా అలానే నిద్రపోతే నోట్లో వాటి యుద్ధం తెల్లార్లూ సాగుతుంది.
 
ఇకపోతే ప్రేమికుల విషయానికి వస్తే... వారిద్దరూ ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే పరస్పరం ఒకరి నుంచి ఇంకొకరికి లక్షల్లో బ్యాక్టీరియా మార్పిడి జరిగిపోతుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రియురాలికి మత్తు కలిగించడం వెనుక బ్యాక్టీరియాదే కీలక పాత్ర. లాలాజలం ద్వారా ప్రియురాలి నోట్లోకి ప్రవేశించిన బ్యాక్టీరియా ఈ పని చేస్తుంది. అంతేకాదు ఇదే బ్యాక్టీరియా ఒకరి వ్యాధిని మరొకరికి, జలుబు, హెర్పిస్ లేదంటే హెపటైటిస్ వంటి అంటువ్యాధులను కూడా సరఫరా చేస్తుంది. అదీ సంగతి. కనుక నోటిని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.