సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 నవంబరు 2019 (12:36 IST)

పాముకు ముద్దెట్టిన యువకుడు.. సిగ్గుపడి పక్కకెళ్లిన రాజనాగం? (Video)

పామంటే ఆమడదూరం పారిపోయే వారు చాలామంది వుంటారు. ఇంకా రాజనాగాన్ని చూస్తే అమ్మో అంటూ గుండె ఆగి చనిపోతారు. అయితే రాజనాగంతో ఇద్దరు యువకులు ఆటాడుకున్నారు. ఆ ఇద్దరు యువకులు రాజనాగంతో కాసేపు వీడియో కోసం ప్రాణాలను పణంగా పెట్టి చుక్కలు చూపించారు. కాటేసేందుకు ఆ రాజనాగం ఎగబడి వస్తున్నా.. ఆ యువకులు ఏమాత్రం జడుసుకోకుండా.. రాజనాగం కాటుకు దూరంగా దాన్ని పట్టుకుని.. ముద్దెట్టుకున్నారు. 
 
ఆ యువకులు అసలేం చేస్తున్నారో తెలియక ఆ రాజనాగం వాళ్లపై బుసలు కొడుతూ పక్కకు జరిగిపోవాలనుకుంటోంది. కానీ వాళ్లు దాన్ని పట్టుకుని ఆడుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో రాజనాగంతో ఆడుకున్న ఇద్దరు యువకుల గురించే చర్చ సాగుతోంది. 
 
ఇద్దరు యువకులు బ్యాగు తగిలించుకుని.. అడవిలో నిలవగా.. 15 అడుగుల రాజనాగాన్ని పట్టాలనుకున్నారు. అయితే ఆ పాము కాటేసేందుకు ఎగబడింది. కానీ ఆ పాము కాటుకు ఆ యువకులు చాకచక్యంగా తప్పించుకుంటూ రాజనాగానికే చుక్కలు చూపించారు. చివరికి రాజనాగానికి ఆ ఇద్దరిలో ఓ యువకుడు ముద్దెట్టాడు. ముద్దివ్వడంతో ఆ రాజనాగం ఏం చేయాలో తోచక సిగ్గుపడేలా పక్కకెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.