శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (15:52 IST)

కత్తిలాంటి కటౌట్.. అందాల నిధి.. కానీ ఆఫర్లు మాత్రం నిల్!

సాధారణంగా వెండితెరపై రాణించాలంటే మంచి అందంతోపాటు కత్తిలాంటి కటౌట్ ఉండాలి. పైపెచ్చు.. అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకంజవేయకూడదు. అలాగే, హృదయ అందాలతో పాటు నాభి అందాలు ఇట్టే ఆకర్షించేలా వుండాలి. అన్నీ వున్నప్పటికీ.. లక్కూ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ సినీ ఆఫర్లు వస్తాయని చెప్పలేం. అలాంటి కోవకు చెందిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ అమ్మడుకి అందంతో పాటు.. అందాల నిధులు పుష్కలం. కానీ ఆఫర్లు మాత్రం నామమాత్రంగానే వస్తున్నాయి. 
 
హైదరాబాద్‌కి చెందిన ఈ బ్యూటీ బెంగళూరు ర్యాంప్‌ని ఇరగదీసింది. అటుపై ముంబై ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ పాపులరైంది. అందాల పోటీల్లోనూ టాప్ స్లాట్‌లో రాణించింది. ఈ మూడు సక్సెస్ అవ్వడంతో 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఈ సినిమా ట్రాక్ తప్పినా.. అఖిల్ జోడీగా 'మిస్టర్ మజ్ను'లో ఆఫర్ పట్టేసింది. అయినా తన సీన్ మారలేదు. 
 
అక్కినేని ఫ్యామిలీ హీరోలతో చేసిన రెండు సినిమాలూ ఈ అగర్వాల్ భామకు కలిసిరాలేదు. దీంతో అప్పటి వరకు పద్దతిగా ఉన్న నిధి.. అందాల ఆరబోతకు తెరతీసింది. తర్వాత ప్రయత్నంగా చేసిన ఇస్మార్ట్ శంకర్‌లో నిధి అగర్వాల్‌ని.. 'అందాల నిధి'గా చూపించాడు పూరి జగన్నాథ్. దీంతో ఈ బ్యూటీ గ్లామర్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ భారీ వసూళ్లను సాధించింది.
 
'ఇస్మార్ట్ శంకర్' సినిమా సక్సెస్‌తో నిధి అగర్వాల్ బిజీ అవుతుందనుకుంటే అలాంటి సంఘటనలేవీ జరగలేదు. గల్లా అశోక్ సినిమాకి ఈ బ్యూటీ కమిట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు సంబంధించి సూపర్‌ స్టార్‌ జుంబారే పాట ప్రోమో మినహా.. దాని ఊసే లేదు. లాక్డౌన్ తర్వాత చాలా సినిమాలు పూజలు చేయించుకుని.. క్లాప్‌లు కొట్టించుకున్నా.. ఏ హీరో సరసనా నిధి అగర్వాల్ పేరు వినిపించడం లేదు. 
 
దీంతో టాలీవుడ్ నుంచి తన మకాం కొలీవుడ్‌కి మార్చే ఆలోచనలో ఉందట ఈ భామ. లాక్డౌన్ టైమ్‌లో ఖాళీగా ఉన్న నిధి అగర్వాల్ ఇప్పుడు తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. 'భూమి'.. 'ఈశ్వరన్' పేర్లతో ఈ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. నిజానికి హీరోయిన్స్‌కి ఒక భాషలో అవకాశాలు లేకపోతే మరో ఇండస్ట్రీపై దృష్టిపెట్టడం కామన్. 
 
కానీ తెలుగులో ఒక సూపర్ హిట్ దక్కిన తర్వాత నిధి అగర్వాల్ కోలీవుడ్ పై శ్రద్ధ పెట్టడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోలీవుడ్‌పై కొత్త మోజుతో నిధి అగర్వాల్ అక్కడికి మకాం మార్చేస్తోందా? అన్న కామెంట్ వినిపిస్తోంది. మరి అక్కడ సినిమాలు పూర్తికాగానే నిధి ఇటో అడుగు వేస్తుందో లేదో వేచి చూడాలి.