శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (09:26 IST)

భర్త చైతన్యతో లిప్ లాక్.. నిహారిక ఆ ఫోటో నెట్టింట పెట్టడం అవసరమా?

Niharika
Niharika
మెగా డాటర్ నిహారిక మళ్లీ ట్రోల్‌కు గురైంది. మొన్నటి మొన్న పబ్ వ్యవహారంతో ఇబ్బందులు పడిన నిహారిక ప్రస్తుతం భర్తతో లిప్ లాక్ ఫోటోలతో నెటిజన్ల ట్రోల్‌కు గురవుతోంది. తాజాగా నిహారిక పోస్ట్ చేసిన లిప్ లాక్ ఫోటోలపై మెగా ఫ్యాన్స్, నెటిజెన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
 
మెగా ఫ్యామిలీ పరువును నిహారిక నడిరోడ్డు పాలు చేసిందని ట్రోల్ చేస్తున్నారు. భర్త జొన్నలగడ్డ చైతన్యతో లిప్ లాక్ చేసిన ఫోటోపై సోషల్ మీడియాలో దుమారం రేగింది.  
 
నిహారిక ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి జోర్దాన్‌కి వెకేషన్ ట్రిప్ కి వెళ్ళింది. ఇక అక్కడ తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది.
 
వాటి తాలూకు ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ట్రోలర్స్ ఇప్పుడు నిహారికకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. 
 
అయితే భర్త కి లిప్ లాక్ ఇస్తున్న ఫోటోని పంచుకోవాల్సిన అవసరం ఏంటనేది ట్రోలర్స్ ప్రశ్న. కానీ మరి కొంతమంది నిహారికను సపోర్ట్ చేస్తున్నారు.