అఖిల్‌కు గాయం - ఏజెంట్ వాయిదా!
అఖిల్ అక్కినేని రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం ఏజెంట్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పూర్తి యాక్షన్ చిత్రంగా తయారవుతోంది. అందుకు తగినట్లుగానే అఖిల్ యాక్షన్ సీన్స్ ఎక్కువగా చేయాల్సివచ్చింది. అందుకు తన బాడీని కూడా మేకోవర్ చేసుకున్నాడు. కండలు తిరిగిన దేహంతో రా ఏజెంట్‌గా బాగా సూటయ్యాడు.
అయితే, ఇటీవలే ఓ యాక్షన్ ఎపిసోడ్ చేస్తుండగా అఖిల్ కాలికి బాగా గాయమైంది. దాంతో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దాంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి కొన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కొంత గేప్ తర్వాత మరలా అఖిల్ షూట్‌లో పాల్గొననున్నాడు. అందుకే చిత్ర విడుదలతేదీని మార్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. అధికారింగా త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారని తెలిసింది.