అక్కినేని కుటుంబ ఫ్రేమ్‌లో ఇద్దరు మిస్ అయ్యారు!
అక్కినేని కుటుంబంలో సినీ హీరోలు బాగానే వున్నారు. నాగార్జున, నాగచైతన్య, సుశాంత్, సముంత్, అఖిల్ కథానాయకులుగా చేస్తున్నారు. నాగచైతన్య నటుడిగా తన నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తూనే వున్నాడు. నాగార్జున ఇంకా యువ హీరోలకు పోటీగా సినిమాలు చేసుకుంటూపోతున్నారు. అయితే ఎవరి పనిలో వారు బిజీగా వుండడంతో వారానికి ఒకసారైన అందరూ కలవాలని అక్కినేని నాగేశ్వరరావు కోరుకునేవారు. అందుకే ఆయన బతికున్నంతకాలం అందరూ ఓరోజు వీలుచూసుకుని మరీ కలిసేవారు. ఇప్పుడు ఆ పద్దతిని నాగార్జున కొనసాగిస్తున్నారు.
కాగా, ఇటీవలే అందరూ కలిసివున్న ఫొటోను అక్కినేని నాగచైతన్య సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. అందరూ హ్యాపీగా కలిసిన ఫొటో అని పెట్టాడు. ఇందుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. కానీ, ఇందులో ఇద్దరు మిస్సింగ్ అంటూ వారు పేర్లు ప్రస్తావించారు. అందుకు అఖిల్, సమంత కనిపించలేదు. వదిన, మరిది కనిపించలేదంటూ కామెంట్ చేశారు.
అఖిల ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది రా ఏజెంట్ పాత్ర కోసం అఖిల్ మేకోవర్ అయ్యాడు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం మాల్దీవులో వున్నాడు. ఇక సమంత అయితే చైతన్యతో విడిపోయాక దూరమయిన సంగతి తెలిసిందే. ఇదేరోజు ఖుషి అనే సినిమాలో విజయ్‌దేవరకొండతో కలిసి నటిస్తున్న స్టిల్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక అక్కినేని కుటుంబ ఫొటో చూసి ఆయన అభిమానులకు సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.