ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (17:24 IST)

మిస్టర్ ఇడియ‌ట్‌ సినిమాలోని కాంతార కాంతార.. సాంగ్ రిలీజ్ చేసిన నిఖిల్

Madhav, Simran Sharma
Madhav, Simran Sharma
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్  "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన "మిస్టర్ ఇడియ‌ట్‌" ట్రైలర్ డిజిటల్ వ్యూస్ లో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
 
ఈ రోజు "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా నుంచి 'కాంతార కాంతార..' లిరికల్ సాంగ్ ను యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. పాట చాలా ఎనర్జిటిక్ గా ఉందన్న ఆయన మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలియజేశారు.
 
అనూప్ రూబెన్స్ మంచి బీట్ తో కంపోజ్ చేసిన 'కాంతార కాంతార..' పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్ పాటలోని ఎనర్జీని రెట్టింపు చేసేలా పాడారు. 'ఎందుకె చిట్టి నువ్వు ఇట్లా పుట్టినావు మందిని సంపుతావు ఏందే, మా లెక్కనే నీకు రెండు కాళ్లు చేతులు ముక్కు మూతి ఉన్నయి గాదె, బలుపు నీకు ట్విన్ బ్రదరా, ఈగో నెత్తి మీద ఫెదరా, మనషులంటే నీకు పడరా, నువ్వేమన్న అవతారా, ఎమి చూసుకుని నీకు ఇంత టెక్కూ, దిష్టి బొమ్మకైన పనికి రాదు నీ పిక్కూ ..కాంతార కాంతార కాంతారా...' అంటూ సాగుతుందీ పాట. కాలేజ్ లో హీరోయిన్ ను హీరో టీజింగ్ చేసే సందర్భంలో ఈ పాటను రూపొందించారు.