హీరో నితిన్ హిట్ కోసం ఏమి చేయబోతున్నాడు?
హీరో నితిన్ వరుస ఫ్లాప్‌లతో కాస్తంత స్లో అయ్యాడు. 'అ ఆ' సినిమాతో ఫర్వాలేదనిపించినా 'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కళ్యాణం' వంటి వరుస డిజాస్టర్లతో నితిన్ మార్కెట్ బాగా పడిపోయింది. తాజాగా నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న 'భీష్మ' సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.
దీంతో పాటు క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. నితిన్-చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో సోషల్ మెసేజ్ ఉంటుందని తెలుస్తోంది.
ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా ఉండబోతోందని సన్నహిత వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో అవయవ దానం కాన్సెప్ట్ హైలెట్ కాబోతోందని వార్తలు బయటకు వస్తున్నాయి.
ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్‌తో పాటే ఎమోషన్లు కూడా ఎక్కువగా ఉంటాయని, ఈ సన్నివేశాలు ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తాయి అని తెలుస్తోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ చిత్రం నితిన్‌కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలంటే వేచి చూడక తప్పదు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.