సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (10:46 IST)

వర్కౌట్లు చేస్తే ఒళ్లు నొప్పులు వచ్చాయని అనుకున్న.. కానీ... స్మిత

ప్రముఖ పాప్ సింగ స్మిత కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆ తర్వాత డైరెక్టర్ తేజలకు ఈ వైరస్ సోకింది. 
 
తాజాగా ప్రముఖ గాయని స్మిత కూడా కరోనా పాజిటివ్ వ్యక్తుల జాబితాలో చేరింది. బాగా వర్కౌట్లు చేస్తే ఒళ్లు నొప్పులు వచ్చాయేమో అనుకున్నానని, కానీ వైద్య పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని వాపోయింది. తన భర్త శశాంక్‌కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని స్మిత వెల్లడించింది. 
 
అయితే తమలో పెద్దగా లక్షణాలేవీ లేవని, ఈ మహమ్మారిని తమ శరీరాల్లోంచి తన్ని తరిమేందుకు వేచిచూస్తున్నామని, కరోనా తగ్గితే ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్మిత వివరించింది. తాము ఇంట్లోనే ఉన్నా కరోనా తమ ఇంటి వరకు వచ్చిందని ట్వీట్ చేసింది.