బిగ్ బాస్ మూడో సీజన్‌కు కూడా హోస్ట్‌గా ఆయనేనా?
టాలీవుడ్‌లో బిగ్ బాస్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన బిగ్ బాస్ తొలి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రెండో సీజన్‌కు ఎన్టీఆర్ లేవపోవడం.. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసినా రీచ్ ఆశించిన స్థాయిలో లేదని టాక్. ప్రస్తుతం మూడో సీజన్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సీజన్‌కి హోస్ట్‌గా వెంకీ, చిరు రేసులో వున్నారని టాక్ వచ్చింది. కానీ తాజాగా ఎన్టీఆఱ్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ తోనే సీజన్ 3 చేయాలనే ఉద్దేశంతో ''బిగ్ బాస్-3'' నిర్వాహకులు ఉన్నారట. అందుకు ఆయన ఒప్పేసుకున్నారని కూడా టాక్ వస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ షూటింగుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ''బిగ్ బాస్ 3'' షూటింగును ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ షోకు ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని పారితోషికంగా తీసుకోనున్నట్లు సమాచారం. ఒక సినిమాకు తీసుకునే మొత్తాన్ని బిగ్ బాస్-3కి హోస్ట్‌గా వ్యవహరించేందుకుగాను యంగ్‌టైగర్ తీసుకునేందుకు సిద్ధపడినట్లు టాక్ వస్తోంది.