మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (17:57 IST)

గీతాంజలిలో గిరిజలా.. ఏ మాయ చేశావేలో సమంతలా.. అఖిల్‌కు?: నాగార్జున

గీతాంజలిలో గిరిజలా, ఏ మాయ చేశావేలో సమంతలా హీరోయిన్ కొత్త అనిపించాలనే ఉద్దేశంతో హలో సినిమా షూటింగ్‌ లేట్ చేసేశామని అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా '

గీతాంజలిలో గిరిజలా, ఏ మాయ చేశావేలో సమంతలా హీరోయిన్ కొత్త అనిపించాలనే ఉద్దేశంతో హలో సినిమా షూటింగ్‌ లేట్ చేసేశామని అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా 'హలో' గురించి నాగార్జున మాట్లాడుతూ.. అఖిల్ సినిమా షూటింగ్‌ హీరోయిన్ ఎంపిక వల్లే లేటయ్యిందన్నారు.

కథానాయిక కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు చెప్పారు. చివరికి దర్శకుడు ప్రియదర్శన్ కూతురు 'కల్యాణి'ని కథానాయికగా తీసుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన హలో సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని.. టైటిల్ చాలామందికి నచ్చిందన్నారు. సినిమా కూడా అదే స్థాయిలో యూత్‌ని ఆకట్టుకుంటుందనే నమ్మకం వున్నట్లు చెప్పారు.
 
ఇకపోతే అక్కినేని నట వారసుడిగా తెరంగేట్రం చేసి దాదాపు ముప్పై ఏళ్లు తెలుగు తెరపై మెప్పించిన అక్కినేని నాగార్జునకు మంగళవారం పుట్టిన రోజు (ఆగస్టు 29). ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజుగారి గదిలో మెంటలిస్ట్ క్యారెక్టర్ అన్నారు. నిజ జీవితంలో కూడా తాను అలాంటి వారిని కలిశానని చెప్పుకొచ్చారు. వారికి గమనించే శక్తి ఎక్కువగా వుంటుందని చెప్పుకొచ్చారు. 
 
దెయ్యాలున్నాయని నమ్ముతారా అనే ప్రశ్నకు దేవుడున్నాడంటే దెయ్యాలు కూడా వున్నాయనే అర్థం కాదా అంటూ ప్రశ్నించారు. ఓ మలయాళ సినిమా స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించామని.. రాజు గారి గది సినిమా జోనర్ కావడంతో ఆ పేరు పెట్టుకున్నట్లు తెలిపారు. సమంత రాజు గారి గది చిత్రంలో ఆత్మగా కనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య జరిగే డ్రామానే ఈ సినిమానని తెలిపారు.

చైతూ పెళ్లికి తాను అతిథి మాత్రమేనని, చెక్ మీద సైన్ పెట్టేశానని.. వారే అన్నీ పనులు చూసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. సైరా ఫస్ట్ లుక్ అదిరిందని తెలిపారు. తారక్ బిగ్ బాస్ షోను సూపర్‌గా హోస్ట్ చేస్తున్నాడని.. ఆ షోలో ఉన్నట్టే నిజజీవితంలోనూ చాలా ఎనర్జిటిక్ అంటూ నాగార్జున కితాబిచ్చారు.