Sairam Shankar, Vinod Kumar Vijayan, Garlapati Ramesh Vihari, Swathi
143, బంపర్ ఆఫర్ వంటి చిత్రాలతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న సాయిరాం శంకర్ నుండి రాబోతోన్న మరో విభిన్న కథా చిత్రం ఒక పథకం ప్రకారం. దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రాన్ని తన వినోద్ విహాన్ ఫిల్మ్స్ బ్యానర్‌తో పాటు గార్లపాటి రమేష్ విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు మంగళవారం హైదరాబాద్‌లో చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ... సినిమాలో నాది లాయర్ పాత్ర. అందుకే డైరెక్టర్‌గారు, నిర్మాతగారు, నేను ఇలా లాయర్ గెటప్‌లో వచ్చాం. ఈ సినిమాలో నా పేరు సిద్ధార్థ నీలకంఠ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు క్రిమినల్ లాయర్‌ని. క్రిమినల్ లాయరా? లేక క్రిమినలా? జరిగిన క్రైమ్‌తో ఈ లాయర్‌కు సంబంధం ఉందా? లేదా? ఇలా ఈ సినిమా క్రైమ్ సస్సెన్స్‌తో ఇంటెన్సిటీ థ్రిల్లింగ్ ఇస్తుంది. దర్శకుడు వినోద్ విజయన్ ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా బెర్లిన్ అవార్డ్‌ను గెలుచుకుంది. ఒట్టాల్ అనే ఆ సినిమా నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. అంటే ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్. వినోద్‌తో నాకు 2005 నుండి పరిచయం ఉంది. అప్పటి నుండి మా మధ్య స్నేహం నడుస్తూనే ఉంది. ఎప్పుడూ సినిమా చేయడానికి కుదరలేదు. కానీ ఈ కథ చెప్పినప్పుడు నేచరే పంపించి ఉంటుందని అనిపించింది
సినిమా మొదలైనప్పటి నుండి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫీల్ ఇస్తూ.. ఏం జరుగుతుంది అని ప్రేక్షకులు అనుకోకపోతే.. నన్ను తిట్టుకోవచ్చు.. వీడు ఇంతేరా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఛాన్స్ ఈ సినిమా ఇవ్వదని నాకు తెలుసు.
ప్రతి షాట్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్‌గారు అంత శ్రద్ధతో ఈ సినిమాను తీశారు. మేము కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని అందరం పని చేశాం. ఈ సినిమా నాకు ఊపిరినిస్తుంది. చాలా మంచి సినిమా చేశాం.. మీరంతా ఆదరిస్తే మేము నిలబడతాం. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ మా టీమ్‌ని అభినందిస్తారు. అందులో నో డౌట్. ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. అందరూ ఎంజాయ్ చేయండి. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో అయితే చూసుండరు. మంచి క్వాలిటీ, మేకింగ్ సినిమాను మరోసారి చూడబోతున్నాం. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో చిన్న కాంటెస్ట్ పెట్టబోతున్నాం. ఎందుకంటే, ఈ సినిమాలోనే చిన్న ప్రమోషన్ ఉంది. అదే మేము ప్రమోషన్‌గా పెట్టుకున్నాం. పట్టుకుంటే పదివేలు.. ఈ సినిమాలో విలన్ ఎవరో కనిపెడితే మీరే హీరో ఇదే కాంటెస్ట్. సినిమా చూస్తూ.. ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెడితే మీకు స్పాట్‌లో పదివేలు ఇస్తారు. మీకు ఒక కూపన్ ఇస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఆ కూపన్‌లో విలన్ ఎవరో చెప్పి.. సెకండాప్ చూసిన తర్వాత మీరు రాసింది కరెక్ట్ అయితే.. స్పాట్‌లో పదివేలు ఇస్తారు. ఇలా మొత్తం ఒక 50 సెంటర్స్‌లో మేము ఇవ్వబోతున్నాం. ఈ సినిమాపై ఇంత నమ్మకం ఎందుకంటే.. స్క్రీన్‌ప్లే అలా ఉంటుంది. క్లైమాక్స్ వరకు విలన్ ఎవరో కనిపెట్టలేరు. అంత గొప్పగా కథ, స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఈ సినిమాను రెడీ చేశారు. ఇదే మా సినిమాకు పబ్లిసిటి. ఫిబ్రవరి 7న ఈ సినిమా చూడండి. అని చెప్పుకొచ్చారు.
నిర్మాత గార్లపాటి రమేష్ మాట్లాడుతూ.. ఒక పథకం ప్రకారం అనే ఒక మంచి మూవీతో ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అందరూ ఈ సినిమాను చూసి హర్షిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమాకు సాయిరామ్ శంకర్‌గారు ఎంతో కష్టపడ్డారు. ఇంతకు ముందు సినిమాలకు ఆయన ఇంత కష్టపడ్డారో లేదో తెలియదు కానీ.. నేను ప్రాక్టీకల్‌గా చూశాను. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు అన్నారు.
చిత్ర దర్శకుడు వినోద్ విజయన్ మాట్లాడుతూ... సాయిరామ్ శంకర్ గారితో ఒక పథకం ప్రకారం అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీశాను. అందరూ ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. సాయిరామ్ శంకర్‌గారు ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ అని చెప్పుకొచ్చారు.
శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు మాట్లాడుతూ.. ఒకప్పుడు భారతీరాజా గారి సినిమాలు ఎలా అయితే థ్రిల్ చేశాయో.. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయ్‌గారు అలాంటి సినిమా రెడీ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. బంపర్ ఆఫర్ సినిమాలో సాయిరాం శంకర్ అందరినీ నవ్వించారు. కానీ ఈ సినిమాలో చాలా సీరియస్‌గా ఉంటారు. ఆయన ఈ సినిమాలో బ్రహ్మాండంగా నటించారు. నాకీ అవకాశాన్ని కల్పించిన దర్శకుడు విజయ్ గారికి, స్వాతిగారికి, కళ్యాణ్‌గారికి, భిన్నుగారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని తెలియజేస్తున్నానని అన్నారు.
కో ప్రొడ్యూసర్ స్వాతి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నానని తెలిపారు.
నటుడు జీను మాట్లాడుతూ... ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగు సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సాయిరామ్ సార్‌తో కలిసి నటించినందుకు చాలా హ్యాపీ. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్రయూనిట్ సమాధానాలిచ్చింది.
సాయిరాం శంకర్, శ్రుతి సోధి, ఆశిమ నర్వాల్, సముద్రఖని, రవి, పచముతు, భాను శ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు: