సోమవారం, 4 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (13:31 IST)

ఇష్టమైన జ్ఞాపకాలలో టిక్ టిక్ టిక్ ఒకటి : రాధా నాయర్

Radha, Kamal Haasan,   Madhavi, Swapna
Radha, Kamal Haasan, Madhavi, Swapna
టిక్ టిక్ టిక్ 1982 తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి తమిళ చిత్రం "టిక్ టిక్ టిక్" మూలం. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రానికి భారతీరాజా దర్శకత్వం వహించారు. ఇందులో నటి రాధ, సారిక, మాధవి, స్వప్న నటించారు. మార్చి 21న విడుదలైన ఈ సినిమా గురించి ఈ ఫోటో పెట్టిన నటి రాధా నాయర్ గతాన్ని గుర్తుచేసుకున్నారు. 
 
టిక్ టిక్ టిక్ సినిమా షూటింగ్ రోజుల నుండి నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇది ఒకటి. అప్పటికి అది నటనలో ఓ భాగమని అనిపించవచ్చు కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన పోరాటాన్ని, శక్తిని నేను మెచ్చుకుంటాను. మాధవి చాలా ధైర్యంగా ఈ డ్రెస్ వేసుకోవడానికి ముందుకు వచ్చింది. అందులో మా రూపాలకు నటి  మాధవికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి అని రాధ ట్విట్టర్లో పేర్కొంది.