సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 21 అక్టోబరు 2019 (18:02 IST)

అబ్బే, నేనందుకు పనికిరానేమో, నేనలా మారిపోతానంటున్న ఆది

ప్రేమ‌కావాలి సినిమాతో తెలుగు తెర‌కు హీరోగా ప‌రిచ‌య‌మై.. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న యువ హీరో ఆది సాయికుమార్. ఆత‌ర్వాత ల‌వ్లీ సినిమాతో మ‌రో విజయం సాధించాడు కానీ.. ఆ త‌ర్వాతే ఆది క‌ష్టాలు మొద‌లయ్యాయి. ఏ సినిమా ఆదికి ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాయి. 
 
రీసెంట్‌గా రిలీజైన జోడి, ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్ చిత్రాలు కూడా ఆదిని ఆదుకోలేక‌పోయాయి.  దీంతో ఆలోచ‌న‌లో ప‌డిన ఆది.. రూటు మార్చాలి అనుకుంటున్నాడ‌ట‌. ఇంత‌కీ.. ఏంటా రూటు అంటే..  కేవలం హీరోగా నటించాలని గిరి గీసుకొని కూర్చుంటే లాభం లేద‌ని, మంచి క్యారెక్టర్ దొరికితే విలన్‌గా కూడా నటించడానికి సిద్ధం అంటూ త‌న రూటు మార్చిన విష‌యాన్ని స‌న్నిహితుల‌కు చెప్పాడ‌ట‌. 
 
ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌లో నా పాత్రను మాత్రమే చెప్పి ఉంటే ఒప్పుకునేవాడ్ని కాదేమో. స్టోరీ మొత్తం చెప్పడంతో నచ్చి, అర్జున్ పండిట్ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించాన‌ని మీడియాకి తెలియ‌చేసారు. ఇదే టైపులో ఉంటే విలన్ పాత్రలో కూడా నటించడానికి సిద్ధం.

స్టోరీ మొత్తం బాగుండి, అందులో త‌న‌ పాత్ర చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే విలన్‌గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. ఇలా తన మనసులో మాట బయటపెట్టాడు ఆది సాయికుమార్. మ‌రి.. విల‌న్‌గా అయినా అవ‌కాశాలు వ‌స్తాయో లేదో చూడాలి.