చిరంజీవి భాజపాలోకి వస్తారా? ఆయనకి అదిచ్చేస్తాం... మాణిక్యాలరావు

Chiranjeevi
Last Modified బుధవారం, 26 జూన్ 2019 (16:49 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం, కొన్నాళ్లు రాజ్యసభ ఎంపీగా వుండటం, మంత్రిగా పనిచేయడం అన్నీ జరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా వున్నారు.

ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి మరింత బిజీగా వున్నారు. సినిమా ఆఫర్లు వస్తున్నా తిరస్కరిస్తూ రాజకీయాలే నా జీవితం అంటున్నారు. ఐతే రాజకీయాలను వదిలేసి సినిమాలు తీసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి వార్తల్లోకి వచ్చారు. అది కూడా రాజకీయ పునఃప్రవేశం చేస్తారంటూ.

ఈ వార్త అటుతిరిగి ఇటు తిరిగి భాజపా నాయకులకు చేరింది. దీనితో మాజీమంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవి లాంటి ఉన్నతమైన విలువలు ప్రజాదరణ కలిగిన నేతలు బీజేపీలోకి వస్తే స్వాగతించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక వ్యక్తి చిరంజీవిగారేననీ, అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తామంటే రెడ్ కార్పెట్ వేస్తామన్నారు.
Chiranjeevi

ఐతే ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను తాను కూడా గమనిస్తున్నానని అన్నారు. కాగా చిరు కనుక భాజపా తీర్థం పుచ్చుకునేందకు అంగీకరిస్తే... ఆయనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు కీలకమైన పదవి ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా వున్నట్లు చెప్పుకుంటున్నారు.చూడాలి.దీనిపై మరింత చదవండి :