సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (14:17 IST)

మోదీ చేప‌ట్టే అయోధ్య రామాలయ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ సాయం

Naveen, Pavankalayn, A.M. Ratnam, etc
కేంద్ర‌ప్ర‌భుత్వంతో స‌త్‌సంబంధాలు పెట్టుకున్న న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లే ఢిల్లీ వెళ్ళి సంబంధిత మంత్రుల‌ను క‌లిశారు. మ‌రోవైపు త‌న సినిమాలు షూటింగ్‌లో పాల్గొంటూ స‌మ‌యం వున్న‌ప్పుడు ఆంధ్ర రాజ‌కీయాల ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తూ స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు. ఇప్ప‌డు త‌ను చేయ‌బోయే సినిమాలు ఐదు వున్నాయి. ఆ నిర్మాతంతా రామమందిర నిర్మాణానికి ఉడ‌తాభ‌క్తిగా సాయం చేస్తామ‌ని అందుకు ప‌వ‌న్‌ను వార‌ధిగా ఎంచుకున్నారు.

వివరాలలోకి వెళితే, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చిత్రాలు నిర్మిస్తున్న అయిదుగురు నిర్మాతలు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భూరి విరాళం చేశారు. శ్రీ ఎ.ఎం.రత్నం (మెగా సూర్య ప్రొడక్షన్స్), శ్రీ ఎస్. రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్), శ్రీ నవీన్ ఎర్నేని (మైత్రి మూవీ మేకర్స్), శ్రీ బండ్ల గణేష్ (పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్) కలసి రూ.54.51 లక్షల విరాళాన్ని అయోధ్య రామ మందిరం కోసం ఇచ్చారు.

శ్రీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ.30 లక్షలు విరాళాన్ని చెక్కు రూపంలో తిరుపతిలో అందించిన విషయం విదితమే. ఆ స్ఫూర్తితోనే నిర్మాతలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నిర్మాతలు- ఆర్.ఎస్.ఎస్. తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్ జీ గారికి చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ బాఘ్ సంఘ్ చాలక్ డా. వేదప్రకాష్, నిర్మాత శ్రీ ఎ.దయాకర్ రావు పాల్గొన్నారు.