శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (10:23 IST)

'రంగ‌స్థ‌లం' చూసిన‌ ప‌వ‌న్ - 'తొలిప్రేమ' త‌ర్వాత ఇప్పుడేన‌ట‌...

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం "రంగ‌స్థ‌లం". చ‌ర‌ణ్ స‌ర‌స‌న స‌మంత క‌థానాయిక‌గా న‌టించిన 'రంగ‌స్థ‌లం' మార్చి 30వ తేదీన ప్రేక్ష

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం "రంగ‌స్థ‌లం". చ‌ర‌ణ్ స‌ర‌స‌న స‌మంత క‌థానాయిక‌గా న‌టించిన 'రంగ‌స్థ‌లం' మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్ప‌టికే ఈ సినిమా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరి రూ.150 కోట్ల దిశ‌గా ప‌రుగులు తీస్తోంది. 
 
ఈ చిత్రాన్ని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్ తన సతీమణితో కలిసి వీక్షించారు. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో వేసిన షోకు రామ్‌చరణ్‌, అనసూయ తదితరులు కూడా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. 
 
సినిమా చూసిన అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ... తొలిప్రేమ త‌ర్వాత థియేట‌ర్‌లో సినిమా చూడ‌లేదు. కానీ.. రంగ‌స్థ‌లం సినిమాని ఎందుక‌నో థియేట‌ర్‌లో చూడాల‌నిపించింది. రామ్ చ‌ర‌ణ్ అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచాడు. నిర్మాత న‌వీన్ గారు ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. సుకుమార్ గొప్ప స్క్రీన్ ప్లే.. మంచి క‌థ‌తో ఈ సినిమాని వాస్త‌వానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండేలా తెర‌కెక్కించారు. నిజంగా నా మ‌న‌సుకు విప‌రీతంగా న‌చ్చిందీసినిమా. మిగ‌తా విష‌యాల‌ను నేను స‌క్స‌స్ మీట్‌లో మాట్లాడాల‌నుకుంటున్నట్టు చెప్పారు.