మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (10:29 IST)

ఎన్నారైలకు సూపర్ గిఫ్ట్.. ఎన్నారైలకు మహాభారతం పుస్తకాలు.. వందల కార్లలో ర్యాలీగా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నారైలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఆధునిక మహాభారతం బుక్‌ని పంపించారు. మహాభారతం పుస్తకం కాపీలు మార్కెట్లో కనుమరుగైపోతున్న సమయంలో పవన్ డబ్బులు పెట్టి ప్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నారైలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఆధునిక మహాభారతం బుక్‌ని పంపించారు. మహాభారతం పుస్తకం కాపీలు మార్కెట్లో కనుమరుగైపోతున్న సమయంలో పవన్ డబ్బులు పెట్టి ప్రింటింగ్ చేయించారు. ఈ పుస్తకాలను ఎన్నారైలకు పంపించారు. ఈ పుస్తకాలపై గుర్తుగా కవర్ పేజ్‌పై తన ఆటోగ్రాఫ్ చేశాడు. పవన్ మహాభారతం పుస్తకాలను పంపడంతో ఎన్నారైలు ఖుషీ ఖుషీగా ఫీలవుతున్నారు. 
 
కాగా, ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇండియన్ కాన్ఫరెన్స్ -2017 కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. అక్కడ చేసిన పవన్ ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌ కోసం అమెరికా వెళ్లిన న్యాష్‌విల్ అనే టౌన్ నుండి వందల కార్లలో ర్యాలీగా హార్వర్డ్ వర్సిటీకి తీసుకువెళ్ళారు. తనపై ఇంత అభిమానం చూపించిన అభిమానులను పవన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.