గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 మార్చి 2023 (10:59 IST)

మూడో మీటింగ్‌లోనే ముగ్గులోకి దింపేందుకు ప్రయత్నించాడు : పాయల్ ఘోష్

payal ghosh
హీరోయిన్ పాయల్ ఘోష్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మీటూ వేదికగా ఆమె పలుమార్లు తనపై జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేసింది. తాజాగా మరోమారు ఇదే తరహా కామెంట్స్ చేశారు. సినిమాలో ఛాన్స్ కోసం కలిసినపుడు అనురాగ్య కశ్యపై తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. అయితే, ఇలాంటి దుష్టులకు బాలీవుడ్‌లో ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయన్నారు. 
 
గతంలో నేను దక్షిణాది చిత్రాల్లో నటించాను. జాతీయ అవార్డులు పొందిన దర్శకులతో కలిసి పనిచేశాను. వారి ఏ నాడు కూడా నన్ను ఇబ్బంది పెట్టేలా నడుచుకోలేదు. కానీ, బాలీవుడ్ విషయానికి వస్తే అనురాగ్ కశ్యప్‌తో ఒక్క సినిమాలో కూడా పని చేయలేదు. కానీ, ఆయన నాపై లైంగికదాడికి తెగబడ్డాడు. మూడో మీటింగులోనే ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్రసీమ గొప్పదని ఎందుకు చెప్పకూడదు అంటూ ఆమె ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.