గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (17:25 IST)

పాయల్ రాజ్ పైపైకి... ఆర్ఎక్స్ 100 ఎక్కిన జిగేల్ రాణి....

టాలీవుడ్‌లో ఆర్ఎక్స్ 100 సినిమా సంచలనం సృష్టించిందనే విషయం చెప్పక్కర్లేదు. చిన్న స్థాయి సినిమాగా వచ్చి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నెగెటివ్ రోల్ చేసి అందర్నీ మెప్పించిన పాయల్ రాజ్‌పుత్‌కు చాలా అవకాశాలు వస్తున్నాయి. అయినా కూడా పాయల్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏ సినిమా చేస్తే ఎలాంటి విజయం వస్తుందో అని బాగా అలోచించి సినిమాలకు సంతకం చేస్తోంది.
 
ఎఫ్ 2 సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న వెంకీమామ సినిమాలో వెంకటేష్ జోడిగా పాయల్ ఎంపికైంది. ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'సీత' సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు రెడీ అయింది. ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫోటో ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జిగేల్ రాణి లుక్‌లో కనిపించే డ్రెస్‌లో ఆర్ఎక్స్ 100 బైక్‌పై ఉన్న ఫోటోను విడుదల చేసారు.  ఈ ఫోటోలు కుర్రకారును బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.