శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (16:49 IST)

పింక్ రీమేక్ సినిమాకు కరోనాతో బ్రేక్.. డీలా పడిన పవర్ ఫ్యాన్స్

పింక్ రీమేక్ సినిమాకు కరోనాతో బ్రేక్ పడింది. దీంతో పవర్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' సమ్మర్లో రిలీజ్ కానున్నట్లు నిర్మాత దిల్ రాజు ముందుగానే ఓ క్లారిటీ ఇచ్చేశారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లను ఆపేశారు. దీంతో వకీల్ సాబ్ సినిమా సమ్మర్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయి. 
 
అలాగే క్రిష్, పవన్ విరూపాక్షి కూడా మరింత లేట్ అయ్యేలా ఉందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఒకవేళ అనుకున్న సమయానికి సినిమా పూర్తైనా.. అప్పటికి వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. ఈ సినిమా వెనక్కి తగ్గక తప్పదు. 
 
కాబట్టి ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి పూర్తయితే, హరీష్ శంకర్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని పవన్ ఆలోచిస్తున్నారు. మరి కరోనా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ వేసింది. దీంతో పవన్ ఇక సినిమా షూటింగ్‌లను వదిలి.. రాజకీయాలపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది.