గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (10:50 IST)

'పొన్నియిన్ సెల్వల్-2' కలెక్షన్లపై నెగిటివ్ టాక్ ప్రభావం?

Ponniin Selvan 2
దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టు "పొన్నియిన్ సెల్వన్-2" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి భారీ భారీ సక్సెస్ సాధించడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, పార్తీబన్, శరత్ కుమార్, ప్రభు, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. 
 
అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది ఆ చిత్రం వసూళ్లపై ప్రభావం చూపింది. తమిళంలో 60 శాతం, హిందీలో 10 శాతం, మలయాళంలో 34 శాతం, తెలుగులో 35 శాతం, కన్నడలో 25 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో ప్రదర్శిస్తుంది. ఈ చిత్రం మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్లు వసూలు చేయగా, ఒక్క తమిళనాడులో రూ.25 కోట్లు, ఏపీ తెలంగాణాల్లో కలిపి రూ.3 నుంచి 4 కోట్లు, కర్నాటకలో రూ.4 నుంచి 5 కోట్లు చొప్పున వసూలయ్యాయి. 
 
అయితే, వారాంతమైన శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, పొన్నియిన్ సెల్వల్ తొలి భాగంగా భారత్‌లోనే రూ.327 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో మాత్రం రూ.170 కోట్ల మేరకు వసూలు చేసింది. లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. తొలి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ప్రేక్షకుల అంచనాలను మాత్రం ఈ రెండో భాగం అందుకోలేక పోయింది.