ఏజెంట్ ఎలా ఉందంటే ? రివ్యూ రిపోర్ట్
ఏజెంట్ అక్కినేని అఖిల్ నటించిన ఈ సినిమా ఈరోజే విడుదల అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా రా ఏజెంటు, టెర్రరిస్ట్ నేపథ్యంలో కథ సాగుతుంది అయితే ఇందులో రా ఏజెంట్‌గా అఖిల్ నటించిన సీన్మా ఎలా ఉందో చూద్దాం,
కథ పరంగా చెప్పాలంటే..
చిన్నతనం నుండి షార్ప్ గా ఉండే అఖిల్ కంప్యూటర్ హ్యాకర్ గా పేరు తెచ్చుకొని ఎప్పటికైనా రా ఏజెంట్ అవ్వాలని కలలుకనే వాడు. దానికి స్ఫూర్తి రా చీఫ్ మమ్ముట్టి. అఖిల్ ఏ విధంగా మమ్ముట్టి మెప్పు పొందాడు. ఆ తర్వాత సీక్రెట్ ఆపరేషన్ లో ఒక రా ఏజెంట్ నుండి దేశాన్ని శాసించే సిండికేట్ గా నిలిచే టెర్రరిస్టు ఎలా మట్టు పెట్టారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమా గతంలో వచ్చిన రా ఏజెంట్ కాన్సెప్ట్లకు తగినట్లే ఉన్నది. అయితే సీరియస్ విషయంలోనూ సిల్లీగా ఉంటూ ఎదుటివారి దృష్టిలో కోతి చేస్తలు అనిపించుకునే వాడు అఖిల్. ఆ కోణంలో తన టార్ గేట్ ఎలా సాధించాడు అన్నది కథ. ఇందులో అఖిల్ చాలా షార్‌గా బాగా చేశారు. విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు ఈ పాత్రకు న్యాయం చేశాడు.
మొత్తంగా దేశంలోని పాలకులను శాసించేది పెట్టుబడిదారుల ముసుగులో ఉన్న ఒక సిండికేట్ వ్యక్తులు అన్నది ఈ సినిమాలో డైరెక్టర్ చూపించాడు. గతంలో సురేందర్ రెడ్డి చేసిన కిక్కు సినిమా తరహాలోనే హీరో విలన్ పాత్ర డిజైనింగ్ ఉంది. అయితే బాంబు బ్లాస్టింగ్ తుపాకుల గోలలతో సామాన్యుడికి పెద్దగా సినిమా నచ్చకపోవచ్చు.
ఇక ఈ సినిమా ఎంత మేరకు ఆదరణ పొందుతుందో అనుమానమే.