గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (15:40 IST)

విడాకులు తీసుకున్న తర్వాత మగవారికి నిజంగా బాధ ఉండదా?

పంజాబీ భామ అయిన పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. పూనమ్ కౌర్ చేస్తున్న ట్వీట్ల గురించి నెటిజన్లు నిగూడర్థాలు వెతుకుతుండటం గమనార్హం.

తాజాగా పూనమ్ కౌర్ విడాకుల గురించి స్పందిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. అయితే పూనమ్ కౌర్ తను చేసిన ట్వీట్‌ను కొంత సమయానికే డిలీట్ చేశారు. 
 
విడాకుల అంశానికి సంబంధించి పూనమ్ కౌర్ ఆసక్తికర ప్రశ్నలు వేశారు. విడాకులు తీసుకున్న తర్వాత మగవారికి నిజంగా బాధ ఉండదా? అని ఆమె ప్రశ్నించారు. లేదంటే ఆడవాళ్లు మాత్రమే ఇబ్బంది పడతారని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. ఆడవాళ్లే మగవాళ్లను మాటలతో బాధిస్తారని పూనమ్ కౌర్ వెల్లడించారు.
 
ఆడవాళ్ల వల్లే మగవాళ్లకు కఠిన పరిస్థితులు వస్తాయని ఈ సమాజం పక్షపాతంతో వ్యవహరిస్తుందా? అని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. విడాకుల అంశం గురించి మనం ఇప్పటికైనా పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నామా? అని పూనమ్ కౌర్ ప్రశ్నించారు.

విడాకుల కోణానికి సంబంధించి మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా? అని ఆమె పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను గంట సమయంలోనే పూనమ్ కౌర్ డిలీట్ చేశారు.