శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 నవంబరు 2021 (11:29 IST)

పియానో వాయించి 19 మంది యువతులను పడేసాడు, గుట్టు బైటపడగానే గుండెపోటు అంటూ...

అతడో పియానో మాస్టర్. చక్కగా పియానో వాయిస్తాడు. అతడు వాయిద్యానికి ముగ్ధులయ్యారు కొందరు యువతులు. వారిలో 19 మందిని లోబరుచుకున్నాడని స్వయంగా అతడి మొదటి భార్య ఫిర్యాదు చేసింది. ఇలా గుట్టు బయట పడేసరికి అతగాడు తనకు గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.

 
పూర్తి వివరాలు చూస్తే... నల్గొండలో విలియమ్స్ అనే వ్యక్తి స్థానికంగా వుండే ఓ చర్చిలో పియానో వాయిస్తుంటాడు. ఈ క్రమంలో చర్చికి వచ్చే యువతులకు వల వేసి వారిని లోబరుచుకున్నాడు. పెళ్లాడుతానంటూ మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం 19 మందిని మోసం చేసినట్లు అతడి భార్య పోలీసులకి ఫిర్యాదు చేసింది.

 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించగా తనకు గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు కనుగొన్నారు. అతడు సాధారణ స్థితికి వచ్చాక అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెపుతున్నారు.