శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (16:57 IST)

సేలం జిల్లాలో 70 యేళ్ళ ముదుసలిపై లైంగికదాడి

తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో 70 యేళ్ళ ముదుసలిపై ఓ యువకుడు లైంగికదాడికి తెగబడ్డాడు. మేకలు మేపుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్న వృద్ధురాలిపై 25 యేళ్ళ షణ్ముగం అనే యువకుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. 
 
సేలం జిల్లా కరుమందురై అనే గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై ఆ యువకుడు ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునేలోపు షణ్ముగం అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు కరుమందురై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి తెలిపారు.