ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 నవంబరు 2020 (17:25 IST)

ఘనంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు రాజా వివాహం

Raja
సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు నటుడు రాజా ఓ ఇంటివాడయ్యారు. హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లలో శనివారం ఉదయం వధువు వెంకటలక్ష్మి హిమబిందు మెడలో రాజా మూడు ముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక‍్రమ్‌, కృష్ణవంశీ, నిర్మాతలు అల్లు అరవింద్‌, వెంకట్‌ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్‌ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 
 
కాగా నటుడు రాజా  కేరెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవడు, ఫిదా, రణరంగం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్‌, అంతరిక్షం, మిస్టర్‌ మజ్ను చిత్రాలతో అతడికి మంచి పేరు తెచ్చాయి. ఇక ఫిదా సినిమాలో వ‌రుణ్ తేజ్‌కు అన్న‌య్య‌గా మంచి నటన కనబరిచాడు. అలాగే మ‌స్తీ, భానుమతి వర్సెస్‌ రామకృష్ణ వెబ్‌ సిరీస్‌లో రాజా నటించారు.