బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (17:40 IST)

జూనియర్ పాండ్యా గురించే నెట్టింట టాక్.. ఇప్పుడే ఐపీఎల్ ఆడేట్లున్నాడే

సోషల్ మీడియాలో జూనియర్ పాండ్యా గురించే ప్రస్తుతం టాక్. హార్దిక్ పాండ్యా - అతని భార్య నటాసా స్టాంకోవిక్ తరచుగా తమ కుమారుడు అగస్త్య పాండ్యా ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం చూస్తూనే వున్నాం. ఈ సిరీస్‌లో లేటెస్ట్ ఫోటో అంతర్జాలంలో సునామీ స్పీడ్‌తో దూసుకుపోతోంది.  
 
పాండ్యా అభిమానులు ఈ ఫోటోకి అదిరిపోయే క్యాప్షన్స్ ఇస్తున్నారు. అచ్చం జూనియర్ పాండ్యా ఇప్పుడే ఐపీఎల్ ఆడేట్లు వున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నందున భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం యుఎఇలో ఉన్నారు. 
 
ఈ సంవత్సరం తండ్రి అయిన స్టార్ క్రికెటర్.. తాజాగా తన జూనియర్ గురించి ఒక ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోకు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్,  యాస్మిన్ కరాచీవాలా తదితరులు పోస్టు పెట్టారు. నటాషా- హార్దిక్ దంపతులకు జూలై 30న బాబు పుట్టిన సంగతి తెలిసిందే.