శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (14:21 IST)

ఆ.. డైరెక్ట‌ర్‌కి షాక్ ఇచ్చిన ప్ర‌భాస్...?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌లేదు. దీంతో బాగా డీలాప‌డ్డ ప్ర‌భాస్  విశ్రాంతి కోసం విదేశాల‌కు వెళ్లాడు. త‌దుప‌రి చిత్రాన్ని జిల్ మూవీ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ తో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి జాన్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇదిలా ఉంటే.. బాహుబ‌లి త‌ర్వాత చేసిన సాహో సినిమా క‌థ విష‌యంలో ప్ర‌భాస్ కేర్ తీసుకోలేద‌నే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభాస్, తదుపరి ప్రాజెక్టు అయిన జాన్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ఇంతకు ముందే జాన్ ఓ 20 రోజుల పాటు షూటింగును జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 
 
విదేశాల‌కు వెళ్లిన ప్ర‌భాస్ జాన్ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్‌ని క‌థపై క‌స‌ర‌త్తు చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. కథలో కొన్ని మార్పులను సూచించి, ఆ మార్పులు చేసిన తరువాతనే షూటింగ్ మొదలుపెడదామని అన్నాడట.  దీంతో కాస్త షాక్ అయిన రాథాకృష్ణ ప్ర‌స్తుతం క‌థ‌ని మ‌ళ్లీ వండుతున్నాడ‌ట‌. మ‌రి.. సాహోతో మిస్సైన స‌క్స‌స్ జాన్ అయినా తీసుకువ‌స్తుంద‌ని ఆశిద్దాం.