సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 జనవరి 2020 (11:54 IST)

#Prabhas20 పూజా హెగ్దెతో నేను, రేపు చెప్తానంటున్న ప్రభాస్

సాహో చిత్రం తర్వాత చేయబోతున్న తర్వాత సినిమా జాన్ కోసం ప్రభాస్ చాలా ప్లాన్స్ వేసుకుంటున్నాడట. అసలే ఇమేజ్ ఇండియా మొత్తం వ్యాపించడంతో చేసే సినిమా స్టామినా ఎలా వుండాలన్నది చెక్ చేసుకుంటున్నాడట. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తన అభిమానులకు నేతి అరెసెల్లాంటి తీపి వార్తను రేపే చెప్తానని తెలియజేశారు. 
 
అల వైకుంఠపురములో బంటును అల్లాండిన మేడమ్ పూజా హెగ్దెను తాజాగా తను నటించబోయే జాన్ చిత్రానికి ఫైనలైజ్ చేశాడు ప్రభాస్. అటు పూజా హెగ్దె వరుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో వుంది. ఇటు ప్రభాస్ ఓవర్ ఇండియాలో తన ఇమేజ్ ఏమిటో చాటి చెప్పాడు. వీరిద్దరి కలయికలో తెరకెక్కబోతున్న చిత్రం 2020లో చూపిస్తాననీ, ఆ విషయాన్ని రేపు  చెప్తానని అంటున్నాడు ప్రభాస్.