శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (13:41 IST)

ప్రభాస్‌తో త్రివిక్రమ్ సినిమా నిజమేనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సాహో సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ప్రభాస్ కొత్త సినిమా చూస్తామా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 
 
తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే...? ప్రభాస్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాడట. ప్రభాస్ రాధాకృష్ణతో చేస్తున్న సినిమా మే నెలకి కంప్లీట్ అవుతుంది. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన అల.. వైకుంఠపురములో ఈ నెల 12న రిలీజ్ అవుతుంది. తర్వాత చేయబోయే సినిమాని ఎవరికీ అనేది ఇంకా ఫైనల్ కాలేదు. 
 
వీరిద్దరు ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నారు కానీ.. ఇప్పటి వరకు కుదరలేదు. వీరిద్దరిని ఓ బడా నిర్మాత కలిపేందుకు ఏర్పాటు చేసినట్టు సమాచారం. పండగ తర్వాత త్రివిక్రమ్ ఫ్రీ టైమ్ చూసుకుని ప్రభాస్ తో మీటింగ్ ఏర్పాటు చేయడానికి నిర్మాత ప్లాన్ చేసినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే... ప్రభాస్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉండచ్చు.