సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 31 డిశెంబరు 2019 (19:45 IST)

రంగంలోకి దిగిన ప్రభాస్... ఇంతకీ దేని కోసం?

రాజమౌళి ఫ్యామిలీ నుంచి మరో జనరేషన్ సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యింది. ఇంతకీ వాళ్లు ఎవరంటారా..? కీరవాణి తనయుడు శ్రీసింహా, కాలభైర. వీరిద్దరూ మత్తు వదలరా చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచమయ్యారు. శ్రీసింహా కథానాయకుడుగా పరిచయం అయితే... కాలభైరవ సంగీత దర్శకుడిగ పరిచయం అయ్యారు. నూతన దర్శకుడు రితేష్ రానా ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డిఫరెంట్ మూవీ అంటూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సినిమాను వీక్షించిన సినీ తారలు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ మత్తు వదలరా సినిమా చూసి యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఫైనల్‌గా కీరవాణి తనయులు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకోవడమే కాకుండా స్టార్ హీరోల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నారు.