శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (13:16 IST)

సజ్జనార్ కాళ్లు కడిగి ఆ నీళ్లను తాగుతానంటున్న శ్రీరెడ్డి (video)

తెలంగాణా రాష్ట్రంలో దిశ హత్య కేసు ఎంత చర్చకు దారితీసిందో తెలిసిన విషయమే. ప్రధానంగా దిశ హత్యకు కారకులైన వారిని ఎన్‌కౌంటర్ చేయడం మరింత చర్చకు తెరలేపింది. ఎన్ కౌంటర్ పైన ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసే శ్రీరెడ్డి ఈసారి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ను పొగడ్తలతో ముంచెత్తింది.
 
సజ్జనార్ మీరు గ్రేట్. మీరు చేసి పని ఎంతో అభినందనీయం. మీ కాళ్ళు కడిగి ఆ నీటిని తాగుతానంది శ్రీరెడ్డి. ఒక యువతికి జరిగిన అన్యాయంపై తీవ్రంగా స్పందించిన సజ్జనార్ మీరు గ్రేట్. ఇప్పుడ కామాంధుల్లో భయం కలిగింది. హ్యాట్సాఫ్ అంటూ శ్రీరెడ్డి పొగడ్తలతో ముంచెత్తింది. ఎప్పుడూ వీడియోల ద్వారా విమర్సలు చేసే శ్రీరెడ్డి మొదటిసారిగా ఒక పోలీసు అధికారిని ప్రశంసించడం.. ఆకాశానికి ఎత్తేసింది.